కౌలు రైతుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి, ఏపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్
Eluru, Eluru | Apr 11, 2024 కౌలు రైతుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని అందుకు వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోల్లో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు పవర్ పేట అన్నే భవనంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభం ఫలితంగా కౌలు రైతులు నష్టాలు, అప్పులలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.