జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో జీవితం పై విరక్తి చెంది ఓ మహిళ బుధవారం ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని అడపాల వీధికి చెందిన మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.