కొత్తగూడెం: వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని, ప్రతి అడుగు పచ్చదనం చేయాలి: సింగరేణి సీఎండీ ఎన్ బలరాం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనం ఉత్సవ కార్యక్రమంలో భాగంగా సింగరేణి సంస్థ ప్రతి అడుగు పచ్చదనం అనే నినాదంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతుందని ఇందులో ఉద్యోగులు అధికారులు స్థానికులు అందరూ పాల్గొనే ప్రత్యేక చొరవ చూపాలని సింగరేణి సంస్థ సిఎండి ఎన్ బలరాం తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆయన సింగరేణి భవన్ లో సంస్థ డైరెక్టర్లు అన్ని ఏరియాలో జనరల్ మేనేజర్లతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా 45 మక్షలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు.