సత్తుపల్లి: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సత్తుపల్లి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ,ఎమ్మెల్యేకు వినతి
ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం లో Citu ఆధ్వర్యం లో ఆశ వర్కర్లు ర్యాలీ చేపట్టారు. తమ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని ఎమ్మెల్యే మట్టా రాగమయి కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా Citu నాయకులు మాట్లాడుతూ దేశానికి పట్టుకొమ్మలుగా చెప్పుకునే గ్రామాలను ఆరోగ్యవంతంగా ఉండేలా ఆశ వర్కర్లు అహర్నిశలు కృషి చేస్తున్నారు అని కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలను లెక్కచేయండ ఆశలు పని చేశారని గుర్తు చేశారు.అలాంటి ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు.