కళ్యాణదుర్గంలో శనివారం జరుగునున్న భక్త కనకదాస జయంతి, విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం రాత్రి కళ్యాణదుర్గం చేరుకున్నారు. అంబేద్కర్ సర్కిల్ మీదగా ప్రజా వేదికకు వెళ్లారు. అంబేద్కర్ సర్కిల్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయలేదని దళితులు ఆగ్రహించారు. అంబేద్కర్ సర్కిల్లో ధర్నా నిర్వహించారు. వెంటనే నారా లోకేష్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.