పలమనేరు: మండలం అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన కీలక విషయాలు వెల్లడించారు. పట్టణంలో గంజాయి గురించి ప్రముఖంగా వినిపిస్తోంది వాటిని కట్టడి చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం, ప్రజలందరూ కూడా మీ ప్రాంతాల్లో గంజాయి వాడుతుంటే దీనిపై తమకు సమాచారం అందించాలని కోరారు. మరో ముఖ్యమైన సమస్య ట్రాఫిక్ దీనిపై దశలవారీగా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.