వర్షాల కారణంగా నిత్య పూజేశ్వర కోనకు వెళ్లే రహదారి వద్ద మూతికోన–రాయి కోన ప్రాంతంలో వంకలు సాగి రహదారి దెబ్బతినడంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పంచలింగాల గుడి సమీప రహదారి పై భారీగా వర్షపు నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం భక్తులు భారీగా తరలి రావడంతో చాలామంది కాలినడకన కొలువు తీర్చుకున్నారు. ఇందుకు స్పందించిన ఇంచార్జ్ ఎండోమెంట్ ఈవో శ్రీధర్, దెబ్బతిన్న రహదారి మరమ్మత్తులు చేపట్టినట్లు తెలిపారు. భక్తులకు అసౌకర్యం లేకుండా అత్యవసర పనులు కొనసాగుతున్నాయని, మహాశివరాత్రి సందర్భంగా మరిన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.