ఎన్నికల ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి సిఐ మోహన్ రావు
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలని రాజాం టౌన్ సిఐ దాడి మోహన్ రావు అన్నారు. పలు గ్రామాల్లో శనివారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రజలతో సమావేశాలు నిర్వహించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కల్పించి అల్లర్లు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధన తప్పకుండా పాటించాలని పోలీసులకు, అధికారులకు సహకరించాలని సిఐ సూచించారు.