పలమనేరు: "మత్తు వద్దు భవిష్యత్తు ముద్దు అంటూ" జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ, యువత మంచి చెడు తెలుసుకోవాలన్న అధ్యాపకులు
పలమనేరు: మండల కేంద్రం నందు మదర్ థెరిసా మరియు మాధవి కళాశాల విద్యార్థినీ విద్యార్థులు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మదనపల్లి రోడ్డు వెంబడి విద్యార్థులు "మత్తు వద్దు జీవితం ముద్దు" అంటూ ప్లకార్డ్స్ చేతబట్టి భారీ ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. అధ్యాపకులు మాట్లాడుతూ, డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల వలన మనిషి జీవితం అగమ్య గోచరంగా మారుతోంది. విద్యార్థి దశ నుండే మత్తు పదార్థాలపై అవగాహన కల్పించాలని సదుద్దేశంతో నేడు ఈ మహత్తర కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనివలన ఏది మంచి ఏది చెడు అనేది విద్యార్థిని విద్యార్థులు తెలుసుకోగలుగుతారన్నారు.