గిద్దలూరు: గిద్దలూరు పరిసర ప్రాంతాలలో మోస్తరు వర్షాలు, ఈదురు గాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం
ప్రకాశం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంతాలలో ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. కొద్దిగా రోజులుగా పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈదురు గాలులు వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఆదివారం ప్రకటించారు. అయితే ఆదివారం కురిసిన వర్షం ఎంత మొత్తంలో వర్షపాతం నమోదయిందో వాతావరణ శాఖ అధికారులు వెల్లడించవలసి ఉంది.