ఉప్పల్ స్టేడియంలో మెస్సి, సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ అద్భుతంగా జరిగింది. నేరుగా మైదానంలోకి ఫుట్బాల్ జెర్సీలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. అభిమానులకు అభివాదం తెలుపుతూ వారు మైదానంలో ఫుట్బాల్ ఆడారు.. కాసేపు సీఎం అని మర్చిపోయారేమో ప్రత్యర్థి జట్టుకూ తన ప్రతిభను చూపించారు. యువ క్రీడాకారులకు ఏమాత్రం తీసిపోకుండా ఫుట్బాల్ ఆడారు. ఆయన గోల్స్ చేస్తూ సొంత టీం లో క్రీడా స్ఫూర్తిని నింపారు.