మంత్రాలయం: కౌతాళంలో కురువ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ భక్త కనకదాసు జయంతి వేడుకలు
కౌతాళం: మండల కేంద్రంలో కురువ సంఘం ఆధ్వర్యంలో శనివారం శ్రీ భక్త కనకదాసు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తుంగభద్ర ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ టిప్పు సుల్తాన్, సొసైటీ ఛైర్మన్ అల్లూరి వెంకటపతి రాజు హాజరై కనకదాసు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ భక్త కనకదాసు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. శ్రీ భక్త కనకదాసు జయంతిని అధికారికంగా నిర్వహించడానికి జీవో విడుదల చేయాలన్నారు.