మిస్బా కుటుంబ సభ్యుల గృహ నిర్మాణ ప్రారంభ పనుల్లో పాల్గొన్న.
మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషా.
అన్నమయ్య జిల్లా. మదనపల్లె నియోజవర్గ శాసనసభ్యులు షాజహాన్ బాషా మంగళవారం మధ్యాహ్నం ఒక గంట ప్రాంతంలో పుంగనూరు మండలం మంగళం గ్రామంల వద్ద మిస్బా కుటుంబం నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ పనులను ప్రత్యేక దువా చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిస్బా కుటుంబాన్ని వైసీపీ నాయకులు పలమనేరు నుంచి తరిమి వేశారని అన్నారు. మిస్బా కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల గృహ నిర్మాణానికి ఐదు లక్షలు ఇంటి స్థలం కేటాయించారని తెలిపారు.