పుంగనూరు: NSS వాలంటీర్ల ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ.
చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రభుత్వ బసవరాజ జూనియర్ కళాశాల NSS స్పెషల్ క్యాంపులో భాగంగా మూడవ రోజు బుధవారం 11 గంటలకు ప్రాంతంలో మంగళం కాలనీలో 'డ్రగ్స్ పై అవగాహనా ర్యాలీ నిర్వహించి, ఇంటింటికీ వెళ్ళి మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. . ప్రజలందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలనీ, ఆరోగ్యంగా జీవించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ M. మురళి, అధ్యాపకులు శ్రీధర్, వెంకట కుమార్ రెడ్డి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.