మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే టిడిపి ఇన్చార్జి మధ్య తీవ్ర వ్యాఖ్యలతో రాజకీయం రసవత్తరంగా మారింది. దీంతో నియోజకవర్గంలోని టిడిపి నాయకులు, వైసిపి నాయకులు పోటాపోటీగా విలేకరుల సమావేశం నిర్వహించారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలను చెప్పలేని ఎమ్మెల్యే, టిడిపి ఇన్చార్జి పై నోటికొచ్చినట్లు మాట్లాడడం సరైన పద్ధతి కాదు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందన్నారు.