శ్రీకాకుళం: టెక్కలిలో యూరియా కొరతపై అధికారులను ప్రశ్నించిన సభ్యులు
టెక్కలి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. యూరియా సరఫరాలో కొరత, జాప్యంపై పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరావును ప్రశ్నించారు. రైతులకు యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారని ప్రైవేట్ డీలర్లు అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్నారని అన్నారు. ఈసమావేశంలో జడ్పీటీసీ దువ్వాడ వాణీ, ఎంపీపీ సరోజినమ్మ, ఎంపీడీఓ ఫణీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.