అసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో రోడ్డు సౌకర్యం కల్పించాలి:CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దినకర్
జిల్లాలోని గిరిజన గ్రామాల్లో రోడ్డు సౌకర్యం లేక ఆదివాసీ గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దినకర్ అన్నారు. సోమవారం. వాంకిడి మండలంలోని ఎనోలీ గ్రామస్తులకు సరైన రోడ్డు సౌకర్యం లేదని గ్రామస్థులతో కలసి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. వాంకిడి మండలం గిరిజన గ్రామంలో రోడ్డు లేక గర్భిణి స్త్రీ మృతి చెందిన సంఘటనలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి గిరిజన గ్రామాలకు అభివృద్ధి చేయడంలో విఫలం అయ్యిందని ఆరోపించారు.