శంకరంపేట ఏ: నిజాంసాగర్ మండలంలో వేర్వేరు చోట్ల గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం
వేర్వేరు చోట్ల గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం వేర్వేరు చోట్ల గల్లంతైన వ్యక్తుల మృతదేహాలు లభ్యమయ్యాయని నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపారు. ఘటన స్థలాల్లో రెండు రోజులుగా ముమ్మరంగా ఫైర్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. ముందుగా బ్రాహ్మణపల్లి కుంటలో స్థానానికి వెళ్లి గల్లంతైన నీరుడి మొగులయ్య మృతదేహం లభ్యం కాగా, మరికాసేపటికి అచ్చంపేట శివారులోని నాగమడుగు వద్ద కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి గల్లంతైన బంజపల్లి గ్రామానికి చెందిన రవీందర్ మృతదేహం లభ్యమైంది. ఘటనలపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.