మొంథా తుపానులో ప్రజలకు అండగా నిలిచిన మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి , ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. మొంథా తుఫాను సమయంలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి శనివారం ఉండవల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మెమొంటోలు, సర్టిఫికెట్లను సీఎం అందించారు. ఈ సందర్భంగా మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తో పాటు ఒంగోలు ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి అభినందించి ప్రశంస పత్రం, ఉత్తమ సేవా అవార్డుతో సత్కరించారు.