తాడికొండ: కూటమితోనే ప్రగతి.. తెనాలి శ్రావణ్ కుమార్.
కూటమితోనే ప్రగతి.. తెనాలి శ్రావణ్ కుమార్. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తాడికొండ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. ఫిరంగిపురంలోని వసంతనగర్, అల్లం వారిపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టే సంక్షేమ పథకాల గురించి శ్రావణ్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ప్రజల నెత్తిన మోయలేని ఆర్థిక భారం మోపారని విమర్శించారు...