చీమకుర్తి పట్టణంలో కొలువైన శ్రీ హరి హర క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి సామూహిక తులసిదలార్చిన కార్యక్రమం వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారికి సామూహిక తులసిదలార్చిన చేశారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన వేద పండితులు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.