మునిపల్లి: మాగ్ధూమ్ పల్లీ వద్ద రోడ్డు ప్రమాదం, క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలైన ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మగ్దూంపల్లి వద్ద మంగళవారం సాయంత్రం 4:30 నిమిషాల సమయం లో చోటుచేసుకుంది. కంకోల్ నుండి జహీరాబాద్ వెళుతున్న బైకును గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వాహనదారుడు రహదారిపై పడిపోయాడు. వెనక నుండి వస్తున్న ఆటో అతనిని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలు ఆటో డ్రైవర్ కు, ద్విచక్ర వాహనదారుడికి గాయాలు కాగా క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.