శ్రీకాకుళం: అధ్వానంగా ఆమదాలవలస-పురుషోత్తపురం రహదారి, గుంతలతో ప్రమాదకరంగా మారిందని, మరమ్మతులు చేయాలని స్థానికులు వినతి <nis:link nis:type=tag nis:id=localissue nis:value=localissue nis:enabled=true nis:link/>
ఆమదాలవలస నుంచి పురుషోత్తపురం వెళ్లే రహదారి అధ్వానంగా తయారయింది. ఇటీవల వర్షాల కారణంగా రహదారిపై ఉన్న గుంతల్లో వర్షపు నీళ్లు చేరాయి. దీంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించలేక ఇబ్బంది పడుతున్నారు. రాత్రి సమయంలో ఈ రహదారిలో ప్రయాణించాలంటే కష్టతరంగా ఉందని వాపోతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.