కళ్యాణదుర్గం: అపిలేపల్లిలో నూతన గృహాలను ప్రారంభించిన హౌసింగ్ అధికారులు
కుందుర్పి మండలం అపిలేపల్లి ప్రభుత్వం నిర్మించిన నూతన గృహాలను బుధవారం హౌసింగ్ డీ ఈ విజయ భాస్కర్, ఏఈ మారుతి ప్రసాద్, తహశీల్దార్ ఓబులేసు ప్రారంభించారు. ఈ సందర్భంగా హౌసింగ్ అధికారులు మాట్లాడారు. ఇల్లు లేని పేదలు ఇంకా ఉంటే ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులు పరిశీలించి ఇంటి స్థలాలు మంజూరు చేయడంతో పాటు ప్రభుత్వం పక్కా గృహాలు నిర్మిస్తుందన్నారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలన్నారు.