తాడేపల్లిగూడెం: వీఆర్ గూడెం హార్టికల్చర్ యూనివర్సిటీలో నేటితో ముగిసిన ఉద్యాన,సస్యరక్షణ శాస్త్రవేత్తల శిక్షణ కార్యక్రమం.
కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు నూతన సాంకేతిక విధానాలను తెలుసుకొని ఆ దిశగా రైతులకు సేవలు అందించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డా. KSS. నాయక్ అన్నారు.గురువారం సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం డా. YSR ఉద్యాన విశ్వవిద్యాలయంలో కేవీకే ఉద్యాన, సస్యరక్షణ శాస్త్రవేత్తల 2 రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు కార్యక్రమం నిర్వహించారు.కె.వి.కె శాస్త్రవేత్తలు ముల నూతన సాంకేతిక విధానాలను తెలుసుకొని ఆ విధంగా రైతులకు సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు