కొండపి: కొండపి మండలం ముక్కోటి గ్రామంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రకాశం జిల్లా కొండపి మండలం ముక్కోటి గ్రామంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని ఆదివారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7,410 నగదు ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని ఎక్కడన్నా పేకాట ఆడుతున్నట్లు ప్రజలు గమనిస్తే వెంటనే 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.