బీబీ నగర్: జైనపల్లి-నాగినేనీపల్లికి వెళ్లే రోడ్డుకు గండి, వాహనాల రాకపోకలు బంద్, ప్రత్యమ్నాయ మార్గాలను సూచిస్తున్న అధికారులు
యాదాద్రి భువనగిరి జిల్లాలో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు బీబీనగర్ మండలం జైనపల్లి నుండి బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లికి వెళ్లే రహదారికి గండి పడింది. మంగళవారం సాయంత్రం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీ వర్షాలకు ప్రధాన రహదారికి గండిపడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.