సూర్యాపేట: సమాజంలో అంగన్వాడీల పాత్ర కీలకం: జిల్లా సంక్షేమ అధికారి దయానంద రాణి
సూర్యాపేట జిల్లా: ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా అందిస్తున్న సదుపాయాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి దయానంద రాణి శుక్రవారం సూచించారు. శుక్రవారం కోదాడ ఐసిడిఎస్ నిర్వహించిన పోషణ మేల సామూహిక అక్షర భాషలో పాల్గొని మాట్లాడుతూ సమాజంలో అంగన్వాడీల పాత్ర చాలా కీలకమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ పారిజాత సూపర్వైజర్లు పోషణ అభియాన్ సఖీ సిబ్బంది అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.