ములుగు: ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ దివాకర టీఎస్
Mulug, Mulugu | Sep 16, 2025 ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ఈ నెల 17న కలెక్టరేట్ ఆవరణలో జరగనున్న కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని ఆయా శాఖల అధికారులను నేడు మంగళవారం రోజున సాయంత్రం 6 గంటలకు ఆదేశించారు. పండుగ వాతావరణంలో ప్రజా పాలన దినోత్సవం ఘనంగా జరుపుకోవాలన్నారు.