ఉంగుటూరు మండలంలో పలు గ్రామాల్లో కుండపోత వర్షం
Machilipatnam South, Krishna | Sep 16, 2025
ఉంగుటూరు, తేలప్రోలు, పొట్టిపాడు, పెద్ద అవుటపల్లి, ఆత్కూరు, ఇందుపల్లి, నందమూరు గ్రామాల్లో మంగళవారం భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షం వల్ల రైతులు, వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.