తాడిపత్రి: తాడిపత్రి లోని పోరాట కాలనీలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ,పెద్దారెడ్డికి చెందిన రెండు స్కార్పియో వాహనాలు ధ్వంసం
తాడిపత్రి లోని పోరాట కాలనీలో ఆదివారం టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సమయంలో అక్కడికి టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కి చెందిన రెండు స్కార్పియో వాహనాలు ద్వంసమయ్యాయి. పలువులు గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.