జంగారెడ్డిగూడెంలో శ్రీగంధం చెట్లు స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు నిందితులు అరెస్ట్
Eluru Urban, Eluru | Sep 17, 2025
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో రైతుల పొలాల్లో శ్రీగంధం చెట్లను నరికి దుంగలు స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్టు చేశారు.. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో నలుగురు నిందితులను డిఎస్పి రవిచంద్ర మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ గంధం చెట్లు స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు నిందితుల వద్ద నుంచి ఐదు లక్షల విలువగల శ్రీ గంధం దుంగలు రెండు బైకులు రెండు కాసుల బంగారు గొలుసు, మూడు రంపాలు ఒక గొడ్డలిని స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు