నంద్యాల జిల్లా అవుకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు డిసెంబర్ 2వ తేదీ నుంచి పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి శ్రీధర్ రావు శనివారం తెలిపారు. అవుకులోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు ఎంఈఓ తెలిపారు.