పట్టణంలో స్వర్ణముఖి నదిలో ఈతకి వెళ్లి బాలుడు మృతి
శ్రీకాళహస్తిలో ఈతకు వెళ్లి బాలుడి మృతి శ్రీకాళహస్తిలోని సువర్ణముఖి నదిలో ఈతకు వెళ్లి బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. శ్రీకాళహస్తి ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన హరుణ్, అతని నలుగురు స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో హరుణ్ పాటు మరొక బాలుడు కొట్టుకెళ్లాడు. మున్సిపాలిటీలో పనిచేసే అరుణ్ గమనించి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. హరుణ్ మృతదేహాన్ని బయటకు తీయగా మరొక బాలుడి ఆచూకి లభ్యం కాలేదు.