ఉదయగిరి: ఉదయగిరి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట 1బి అడంగల్ వచ్చేటట్లు చెయ్యాలని రైతులు ఆందోళన
ఉదయగిరి మండల పరిధిలోని రైతులకు 1బీ అడంగల్ వచ్చేటట్లు చేయాలని శనివారం ఎమ్మార్వో కార్యా లయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ.. భూమి కలిగిన ప్రతీ రైతుకు పాస్ బుక్, 1బీ అడంగల్ వచ్చేటట్లు చేయాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులు తప్పిదం వల్ల ఈ పరిస్థితి నెలకొందని, వెంటనే అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి పరిష్కారం చూపాలని కోరారు.