పాలకొండ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం వద్ద ఉద్రిక్తత
పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ మండల పరిషత్ కార్యాలయం వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తన అనుచరులతో అక్కడికి రావటంతో అక్కడ అధికారులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదము తోపులాట జరిగింది.