పట్టణంలోని భారీ వర్షాలకు కూలిన కోర్టు ప్రహరీ గోడ, రెండు ఇల్లు ధ్వంసం, తప్పిన పెను ప్రమాదం
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని చెంబెడు కాలువ వద్ద భారీ వర్షాలకు కూలిన ప్రహరీ గోడ తప్పిన పెను ప్రమాదం, వివరాల్లోకి వెళితే పట్టణ పరిసర ప్రాంతాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం రాత్రి కోర్టు వద్ద గల కర్మ క్రియల మండపం పక్కన ఉన్నటువంటి చెంబెడు కాలువద్ద ఆనుకుని ఉన్న 30 అడుగుల కోర్టు ప్రహరీ గోడ కూలిపోవడం జరిగింది, రెండు ఇల్లు ధ్వంసం కావడంతో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు, టిడిపి నాయకులు ఘటన స్థలానికి చేరుకుని వారికి భరోసాలు ఇవ్వడం జరిగింది అధికారులు అప్రమత్తమై వారికి నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు