ములుగు: పారిశుద్ధ్య కార్మికుడు మహేష్ కుటుంబానికి అండగా నిలిచిన KTR
Mulug, Mulugu | Sep 16, 2025 ఇటీవల పారిశుద్ధ్య కార్మికుడు మహేశ్ పురుగుల మందు తాగి మరణించిన విషయం తెలిసిందే. మృతుడి కుటుంబానికి మాజీ మంత్రి కేటీఆర్ రూ.5,50,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ మేరకు నేడు మంగళవారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు బిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజవర్గ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి, మాజీ గ్రంధాలను ఛైర్మన్ గోవింద నాయక్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.