పిఠాపురం : పాదగయ క్షేత్రంలో పురోహితిక అమ్మవారు, మొదటి రోజు బాలత్రిపుర సుందరిగా భక్తులకు దర్శనం
కాకినాడ జిల్లా పిఠాపురం దక్షిణ కాశీగా పిలవబడే శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం ఉదయం పురుహుతిగా అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పురుహుతిగా అమ్మవారు బాలాత్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి పండితులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి, కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు