సత్యసాయి జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో మంగళవారం 11:30 గంటల సమయంలో పరిటాల సునీత జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి సాగు చేసిన పంట పొలాలను పరిటాల సునీత పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉన్న వ్యవసాయం ఎప్పుడు మర్చిపోలేదని సమయం ఉన్నప్పుడు వ్యవసాయ క్షేత్రాన్ని కూడా సందర్శిస్తున్నానని. అదే విధంగా రైతుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన ఐదవ ప్రధానమంత్రి రైతు విజేత గుర్తింపు పొందిన చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా జాతీయ రైతు దినోత్సవం నిర్వహించడం శుభ పరిణామం అని పరిటాల సునీత పేర్కొన్నారు.