నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ఆర్యవైశ్యుల ఇలవేల్పైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలుఅత్యంత వైభవంగా జరిగాయి. పట్టణ ఆర్యవైశ్య సంఘం ,మహిళా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి ఉత్సవవిగ్రహాలకు భక్తి శ్రద్ధలతో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి అమ్మవారికి ప్రాతఃకాల సమయంలోనే అభిషేకాలు అర్చనలు తదితర పూజా కార్యక్రమాలను సాంప్రదాయపద్ధంగా నిర్వహించారు. అలాగే ఆర్యవైశ్య మహిళలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ గావించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి