చిగురుమామిడి: సుందరగిరిలో నిర్వహించిన అభిప్రాయ సేకరణలో గందరగోళం ప్రవేశపెట్టిన లిస్టులో కొంతమంది తమ పేరు లేదని ఆందోళన
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో నాలుగు వరసల రోడ్డు నిర్మాణం కోసం బుధవారం ఉదయం 11గంటలకు గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో నిర్వహించిన అభిప్రాయ సేకరణలో గందరగోళ నెలకొంది. ప్రవేశపెట్టిన లిస్టులో లో కొంతమంది తమ పేరు లేదని, మరి కొందరు తగిన నష్టపరిహారం ఇవ్వడం లేదని అధికారులను నిలదీశారు. తమ గ్రామం నుంచి నాలుగు వరసల రోడ్డు వేయడం వల్ల గ్రామంలో చాలా ఇండ్లు కూలిపోతున్నామని నష్టపరిహారం మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదేవిధంగా గ్రామంలో ఓ వ్యక్తి తన ఇల్లు పోతుందా అని ప్రశ్నించారు.