ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో పరిమితికి మించి ఆటోలలో వెళుతున్న కూలీలకు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు కౌన్సిలింగ్ ఇచ్చారు. అలానే ఆటో డ్రైవర్ కు జరిమానా విధించడంతోపాటు వార్నింగ్ ఇచ్చినట్లు శనివారం తెలిపారు. రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూలీలు పరిమితికి మించి ఆటోలలో వెళ్ళవద్దని తెలిపారు. ఆటో డ్రైవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తీవ్రంగా ఎస్సై నాగమల్లేశ్వరరావు హెచ్చరించారు.