కొత్తగూడెం: డిప్యూటీ డిఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమావేశం నిర్వహించిన జిల్లా వైద్యాధికారి కళావతి.
రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య శాఖ అధికారి కళావతి భాయ్ కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ డిఎంహెచ్వో లు కొత్తగూడ గంగారం మండలాల ప్రోగ్రాం ఆఫీసర్లతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై గురువారం సాయంత్రం ఐదు గంటలకు సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ సంరక్షణ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీల నమోదు 12 వారాల్లో జరగాలని సాధారణ ప్రసాదాలు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరగాలని సిజేరియన్ ఆపరేషన్లను తగ్గించాలని పిల్లలకు 100% వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలని కోరారు.