జమ్మలమడుగు: దత్తాపురం : గ్రామంలోని వంకనీళ్లలో పడి బాలుని మృతి
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని కొండాపురం మండలంలోని దత్తాపురం ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన గంగాధర్ యాదవ్ కుమారుడు లడ్డు (3) ఆదివారం మధ్యాహ్నం వంక నీళ్లలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం సెలవు కావడంతో పిల్లలందరూ కలిసి ఆడుకుంటూ వంక దగ్గరికి వెళ్లారు. ప్రమాదవశాత్తు వంక నీళ్లలో పడి లడ్డు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీనితో గ్రామంలో విషాదం నెలకొంది.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.