దేవలంపేటలో వెలసిన చౌడేశ్వరీ దేవి ఆలయంలో అత్యంత వైభవంగా గ్రామోత్సవం
దేవలంపేటలో వెలసిన చౌడేశ్వరీ దేవి ఆలయంలో అత్యంత వైభవంగా సోమవారం రాత్రి గ్రామోత్సవం నిర్వహించారు.కలకడ మండలం బాలయ్యగారి పల్లి పంచాయతీ దేవలంపేటలోని చౌడేశ్వరీ దేవి ఆలయంలో తొగట వీర క్షత్రియులు, ప్రజలు జ్యోతి ఉత్సవాలను నిర్వహించారు. మేళతాళాలు, డప్పువాయిద్యాల నడుమ జ్యోతులను తలపై పెట్టుకుని నృత్యాలు చేస్తూ ఆలయం వరకూ వెళ్లి అమ్మవారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన రథం పై అమ్మవారిని అధిరోహింప జేసి పట్టణ పురవీదుల్లో ఊరేగించారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో కోలాట నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకర్షితులను చేశాయి.