మేడ్చల్: ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివాసి తెగల రాష్ట్రస్థాయి మేదో మదనం కార్యక్రమం
మాజీ ఎంపీ సోయం బాపూరావు తెలిపిన వివరాల ప్రకారం ఆదివాసీల హక్కుల సాధనకై సెప్టెంబర్ 28వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీలోని గెస్ట్ హౌస్ లో 9 ఆదివాసి తెగల రాష్ట్రస్థాయి మేదో మధనం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. సోయం బాపూరావు మాట్లాడుతూ డిసెంబర్ 9న హైదరాబాదులో ఆ తర్వాత ఢిల్లీలో కూడా భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.