ఫిరంగిపురం: ఫిరంగిపురంలో ఉద్రిక్తత, స్థలం వివాదంలో ఇరువురి మధ్య ఘర్షణ
ఫిరంగిపురంలో సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యువకుడిపై సీఐ చేయి చేసుకోవడంతో యువకుడి తరుపున బంధువులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు సీఐ రవీంద్రబాబు తుపాకీ పట్టుకున్నారు. దీంతో స్థానికులు రాళ్లు రువ్వారు. అనంతరం సీఐపై కర్రలతో దాడికి యత్నించారు. సీఐ అక్కడ నుంచి బైక్పై వెళ్లిపోయారు. కాగా ఈ ఘటన ఓ స్థలం వివాదంలో చోటు చేసుకుంది.