సంగారెడ్డి: పరిశ్రమలలో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఉద్యోగి సేఫ్టీ నియమాలు పాటించాలి: ఎస్పీ పారితోష్ పంకజ్
పారిశ్రామిక వాడలలో మరియు పరిశ్రమలలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రతి ఒక్క ఉద్యోగి సేఫ్టీ నియమాలను పాటించాలని ఈ నియమాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు ఈ మేరకు గురువారం పాశమైలారం పారిశ్రామిక వాడలో ఆపియోరియ ఫార్మా యూనిట్ - 4 ప్రైవేట్ లిమిటెడ్ లో మాక్ డ్రిల్ పోలీసు శాఖ,రెవెన్యూ శాఖ,ఎన్డిఆర్ఎఫ్ శాఖల సమన్వయంతో నిర్వహించారు. పరిశ్రమలలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు సిబ్బంది సురక్షితంగా బయటపడే మార్గాలు అవగాహన కల్పించారు.