తాడిపత్రి: తాడిపత్రి మున్సిపాలిటీ తోపాటు మండల వ్యాప్తంగా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు
తాడిపత్రి మున్సిపాలిటీ తో పాటు మండల వ్యాప్తంగా శనివారం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఆయా రాజకీయ పార్టీ నాయకులు, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.